Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థి ఎవరో తెలిస్తే షాకే?

జయలలిత మరణం తరువాత జరిగిన ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నాడిఎంకే పార్టీ తరపున ప్రిసీడియం ఛైర్మన్‌గా ఉన్న మధుసూదన్, డిఎంకే పార్టీ నుంచి మరుదు గణేష్, బిజెపి నుంచి నాగరాజన్, స్వతంత్ర అభ్యర్థిగా టి.టి.వి. దిన

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థి ఎవరో తెలిస్తే షాకే?
, శుక్రవారం, 22 డిశెంబరు 2017 (13:28 IST)
జయలలిత మరణం తరువాత జరిగిన ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నాడిఎంకే పార్టీ తరపున ప్రిసీడియం ఛైర్మన్‌గా ఉన్న మధుసూదన్, డిఎంకే పార్టీ నుంచి మరుదు గణేష్, బిజెపి నుంచి నాగరాజన్, స్వతంత్ర అభ్యర్థిగా టి.టి.వి. దినకరన్‌లతో పాటు మొత్తం కలిపి 56 మంది పోటీ చేశారు. ఎన్నికల తరువాత గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.
 
జయలలిత మరణం తరువాత అన్నాడిఎంకేలో చీలికలు ఏర్పడ్డాయి. పార్టీలోని నాయకులు మూడు వర్గాలుగా విడిపోయాయి. ఆ తరువాత రెండు వర్గాలుగా మారింది. ప్రభుత్వంలో ఉన్న పన్నీరుసెల్వం, పళణిస్వామిలు ఇద్దరూ కూడా ఇప్పుడు ఎడమొఖం పెడముఖంగానే ఉన్నారు. ఇద్దరి మధ్యా అసలు సఖ్యత లేదు. పళణి, పన్నీరులపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం ఆ పార్టీ తరపున అభ్యర్థిగా మధుసూదన్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. 
 
అందులోను మధుసూదన్ తెలుగు వ్యక్తి. నెల్లూరు జిల్లా కావలిలో పుట్టారు. అంతేకాదు ఆర్కే నగర్‌లో తెలుగువారు లక్ష మంది ఉన్నారు. ఇది కూడా మధుసూదన్‌కు బాగా కలిసొస్తుందని అందరూ భావించారు. కానీ ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడంలేదు. మధుసూదన్ విజయం సాధ్యం కాదని తెలుస్తోంది.
 
ఇక తమిళ ప్రజలు ప్రత్యామ్నాయంగా డిఎంకే పార్టీవైపే మొగ్గు చూపుతారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రతిసారి ఒక్కొక్కరికి ప్రజలు అవకాశం ఇస్తుంటారు. అందులోను జయ మరణం తర్వాత అన్నాడీఎంకె పార్టీలో తలెత్తిన వివాదాలు ఆ పార్టీ విజయావకాశాలను గండికొట్టినట్టే అవకాశం వుందంటున్నారు. డిఎంకే నేత కరుణానిధి కుమార్తె కనిమొళి, రాజాలు 2జి కుంభకోణంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసు కొట్టేయడం డిఎంకేకు బాగా కలిసొచ్చింది. నిన్న మధ్యాహ్నం డిఎంకేకు అనుకూలంగా తీర్పు రావడంతో ప్రజల్లో డిఎంకేపై నమ్మకం పెరిగింది. ఇక డిఎంకే అభ్యర్థి మరుదు గణేష్‌ విజయం సాధించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇక స్వతంత్ర్య అభ్యర్థిగా ఉన్న టిటివి దినకరన్ గెలుపు సాధ్యమయ్యే అవకాశమే లేదు. దినకరన్ గతంలో ఏకంగా ఎన్నికల కమిషన్‌కే రెండాకుల గుర్తు కోసం డబ్బులు ఇవ్వడం, జయలలిత మరణంపై కావచ్చు, ఆస్తుల వ్యవహారంలో కావచ్చు..ఇలా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించిన దినకరన్‌ గెలవడం అస్సలు సాధ్యం కాదంటున్నారు. ఇలా చూస్తే డిఎంకే అభ్యర్థి మరుదు గణేష్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక్కడ శత్రువు ఎక్కడో లేడంటున్న రాజమౌళి (వీడియో)