Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడల్‌పై ఢిల్లీలో గ్యాంగ్ రేప్: సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని.. అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి?

మహిళలపై అఘాయిత్యాలకు అడ్డాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కామాంధులు విరుచుకుపడ్డారు. నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకున్నా కామాంధులపై కఠినమైన చట్టాలు తెచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేస్తోంది. తాజాగా ఢిల

మోడల్‌పై ఢిల్లీలో గ్యాంగ్ రేప్: సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని.. అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి?
, గురువారం, 28 డిశెంబరు 2017 (10:17 IST)
మహిళలపై అఘాయిత్యాలకు అడ్డాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కామాంధులు విరుచుకుపడ్డారు. నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకున్నా కామాంధులపై కఠినమైన చట్టాలు తెచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేస్తోంది. తాజాగా ఢిల్లీలో మోడల్, నటిపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది.
 
పలు టీవీ సీరియళ్లలో నటించిన ఆమెను సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామంటూ నమ్మించిన కామాంధులు.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన సదరు యువతి మోడలింగ్ కోసం ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చిన ఆమె బుల్లితెరపై చిన్న చిన్న రోల్స్‌లో కనిపించింది. ఇంతలో ముగ్గురు యువకులు ఆమెను కలిసి.. సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ నమ్మబలికారు. ముంబైలో ఇందుకోసం ప్రత్యేక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వారి మాటలను నమ్మిన మోడల్.. డిసెంబర్ 25న వారితో కలిసి వెళ్లింది. 
 
అయితే ఆ ముగ్గురు కామాంధులు ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు  ఫిర్యాదు చేసినా నిందితులు అరెస్టయిన కొన్ని గంటల్లోనే విడుదలయ్యారు. దీంతో, బాధితురాలు తన ప్రాణాలకు ముప్పు వుందని చెప్తోంది. కానీ పోలీసులు మాత్రం వారు బెయిల్‌పై వచ్చారని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్తున్నారు. 
 
అయితే నెటిజన్లు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారికి బెయిల్ దక్కనీయకుండా చేసివుండాలని.. మహిళపై అఘాయిత్యానికి పాల్పడి... స్వేచ్ఛగా బయట తిరుగుతున్న నిందితులకు కఠిన శిక్ష విధించాలని మహిలా సంఘాలు కూడా మండిపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరివేపాకులా మారిపోయాం- ఎంపీలుగా చేసిందేమీ లేదు: జేసీ దివాకర్ రెడ్డి