Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబైలో విరుష్క రిసెప్షన్.. సతీమణులతో తరలివచ్చిన భారత క్రికెటర్లు (వీడియో)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహ రిసెప్షన్ ముంబైలో జరిగింది. ఈనెల 11వ తేదీన ఇటలీలో కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

Advertiesment
ముంబైలో విరుష్క రిసెప్షన్.. సతీమణులతో తరలివచ్చిన భారత క్రికెటర్లు (వీడియో)
, బుధవారం, 27 డిశెంబరు 2017 (11:34 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహ రిసెప్షన్ ముంబైలో జరిగింది. ఈనెల 11వ తేదీన ఇటలీలో కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత 21వ తేదీన ఢిల్లీలో తొలి రిసెప్షన్ ఏర్పాటు చేయగా, ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి ముంబైలో మరో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. విరుష్క జంట ఏర్పాటు చేసిన విందుకు భారత క్రికెటర్లంతా తమ తమ సతీమణులతో హాజరుకాగా, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన తారంలతా తరలివచ్చారు. 
 
ముఖ్యంగా, విరుష్క రిసెప్షన్‌లో బాలీవుద్ బాద్‌షా షారుక్ ఖాన్ చిందులేశాడు. ఫిల్మ్ స్టార్ అనుష్కా శర్మతో రిసెప్షన్ పార్టీలో షారుక్ స్టెప్పులేశాడు. ఓ పంజాబీ ట్రాక్‌కు అనుష్కా, షారుక్‌లో డాన్స్‌తో ఊపేశారు. అనుష్కా, షారుక్‌తో పాటు కోహ్లీ కూడా స్టెప్పులేస్తున్న వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కోహ్లీ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోలను పోస్ట్ చేశారు. 2008లో రిలీజైన 'రబ్ నే బనా ది జోడీ' చిత్రంలో షారుక్‌తో అనుష్క నటించిన విషయం తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి ఎఫెక్ట్ : పడిపోయిన కోహ్లీ ర్యాంక్