ఐసీయూలో పెళ్లి.. మూడు ముళ్లు పేసి పారిపోయిన వరుడు

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:16 IST)
ప్రేమ పేరుతో లోబరుచుకుని శారీరక సుఖాన్ని అనుభవించాడు. ఆ తర్వాత పెళ్లి మాటెత్తగానే ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించగా, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడుని పట్టుకుని వచ్చి ఐసీయూలోనే మూడు ముళ్లు వేయించారు. కానీ, పెళ్లికాగానే ఆ వరుడు పారిపోయాడు. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూరజ్‌ నలవాడే అనే యువకుడు ఓ యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తూ వచ్చాడు. పెళ్లి పేరుతో ఆమెను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే పెళ్లి చేసుకుందాం అని యువతి అడిగేసరికి అతను ముఖం చాటేశాడు. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు గత నెల 27వ తేదీన పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. తనది తక్కువ కులం కావడంతోనే పెళ్లికి అంగీకరించలేదని బాధితురాలు వాపోయింది. 
 
ఓ యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అనేసరికి ముఖం చాటేశాడు. బాధిత యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఐసీయూలోనే వీరిద్దరికి పెళ్లి జరిపించారు పోలీసులు. ఈ ఘటన 
 
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆ యువకుడిని యువతి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి నిన్న తీసుకువచ్చారు. ఐసీయూలోనే యువతితో బలవంతంగా యువకుడికి పెళ్లి జరిపించారు. పోలీసుల సమక్షంలోనే ప్రేమికులు దండలు మార్చుకున్నారు. అయితే పెళ్లి అయిన కొద్దిసేపటికే యువకుడు ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments