ఆ దోమ కుట్టింది, ఐనా కమిట్ అయ్యాను కనుక వదిలిపెట్టను: రష్మిక మందన

గురువారం, 5 డిశెంబరు 2019 (17:24 IST)
రష్మిక మందన, టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్‌లో ఈమె కూడా ఒకరు. గీతా గోవిందం సంచలనం తరువాత, టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక స్టార్‌డమ్ పెరిగింది. ఇప్పుడు ఆమె కాల్షీట్స్ కోసం సినీ ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు.

ఇప్పటికే రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకేవరులో రొమాన్స్ చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయడానికి సిద్దమైంది. వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబోయే ఎంటర్టైనర్ భీష్మాలో కూడా రష్మిక నటిస్తోంది.
 
ఇదిలావుంటే, ఆమె డెంగ్యూ వ్యాధితో బాధపడినట్లు రష్మిక వెల్లడించింది. ఆమె "రెండు నెలల క్రితం, నేను డెంగ్యూతో బాధపడ్డాను. అయినప్పటికీ నేను షూటింగులో పాల్గొంటూనే వున్నాను. డెంగ్యూ జ్వరం తగిలింది కదా అని ఇంట్లో ముడుచుకుని పడుకోలేను. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయ్యానంటే దాన్ని నెరవేర్చే వరకూ వదలిపెట్టే మనస్తత్వం కాదు నాది. నేను వర్క్‌లో చాలా సిన్సియర్‌ని'' అంటూ చెప్పుకొస్తోంది రష్మిక

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సెక్సీయస్ట్ ప్రభాస్... ఆసియా అత్యంత శృంగార పురుషుడు