Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వు మరీ అంత స్పీడ్ అయితే ఎలా? కోడలికి అత్త క్లాస్, ఎందుకు?

Advertiesment
newly married woman
, గురువారం, 5 డిశెంబరు 2019 (20:00 IST)
విజయవాడలోని గాంధీపురం. సరిగ్గా నెలక్రితం రాజేష్ అనే యువకుడితో 20 యేళ్ళ ఒక యువతిని ఇచ్చి వివాహం చేశారు. మొదట్లో రాజేష్ వెకిలి వేషాలు వేసేవాడు. సరిగ్గా మాట్లాడడు. అయోమయంగాడిలా ఉన్నాడు. అయితే పెళ్ళికి ముందు అతన్ని చూసినప్పుడు అబ్బాయి తాలూకూ వాళ్ళని అతను ఎందుకు అలా ఉన్నాడు అని అడిగారు. 
 
అయితే వాళ్ళ అమ్మ మావాడు చాలా బుద్ధిమంతుడు..అమాయకుడు, ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడడని గొప్పగా చెప్పారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళయి నెల రోజులైంది. అయితే ఇంతవరకు భార్యతో కలవలేదు రాజేష్. దీంతో ఆ యువతి లబోదిబోమంటూ రాజేష్ తల్లికి విషయమంతా చెప్పింది.
 
దీంతో ఆమె నువ్వు అంత స్పీడ్ అయితే ఎలా. మావాడు అమాయకుడు. కాస్త నింపాదిగా నువ్వే చెప్పు.. పని జరిగేటట్లు చూసుకో అంటూ చెప్పింది. దీంతో ఆ యువతికి అంతా అర్థమైపోయింది. తాను మోసపోయాయని తెలుసుకుని బంధువులతో పంచాయతీ పెట్టింది. ఈ పంచాయతీ కాస్త పోలీస్టేషన్ వరకు వెళ్ళింది. కానీ యువతి తల్లిదండ్రులు కేసు పెట్టకపోవడం.. రాజేష్ కుటుంబ సభ్యులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో ఆ యువతి ప్రస్తుతం మౌనపోరాటం చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య