Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాపై మనసుపడిన కుర్రోడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. చివరకు...

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (10:51 IST)
ఓ హిజ్రాపై ఓ యువకుడు మనసు పారేసుకున్నాడు. ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం పెద్దలను ఎదిరించి హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. కానీ, నెల రోజులు కూడా తిరగకముందే వారిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్లారు ప్రాంతానికి చెందిన దిలీప్ (26) అనే యువకుడు నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ (30) అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెంచింది. ఫలితంగా వారిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంతగా మారిపోయారు. దీంతో షివానీతో దిలీప్ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. 
 
వీరిద్దరి వ్యవహారం దిలీప్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులంతా గట్టిగా మందలించారు. అయినప్పటికీ దిలీప్ మాత్రం షివానీనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత నెలరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టి వెళ్లిన దిలీప్... కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో షివానీతో కాపురంపెట్టాడు. 
 
ఇంతలా ప్రేమను పంచుకున్న ఇద్దరి మధ్య వేరుకాపురం పెట్టిన తర్వాత ఏమైందో ఏమో శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments