మధురైలో దారుణం.. తలనరికి చర్చి ముందు విసిరేసిన వ్యక్తి

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (17:06 IST)
నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ గ్యాంగ్ ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చింది. అతని తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో ఈ దృశ్యాలను చిత్రీకరించడంతో... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మధురై ఉలిక్కిపడింది.
 
వివరాల్లోకి వెళితే.. ఊతంగడికి చెందిన మురుగానందం (22) నవంబర్ 16 తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. నిత్యం రద్దీగా ఉండే కిజావసల్ ప్రాంతంలోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా... కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు అతన్ని అడ్డగించారు. ఈ క్రమంలో మురుగానందం పారిపోయేందుకు యత్నించగా.. ఆ గ్యాంగ్ అతన్ని వెంబడించి మరీ హత్య చేసింది. మురుగానందం తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది.
 
ఆ గ్యాంగ్ దాడిలో మురుగానందం స్నేహితుడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఇంకా విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments