Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-11-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే..?

Advertiesment
15-11-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే..?
, ఆదివారం, 15 నవంబరు 2020 (05:00 IST)
ఆదివారం మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే ఆర్థికాభివృద్ధి పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మేషం: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలు కుంటారు. బంధుమిత్రులతో మీ మాటకు, వ్యక్తిత్వానికి గుర్తింపు లభిస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి.
 
వృషభం: ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. మనసును ఏదో వెలితి బాధిస్తుంది. హోటల్, తినుబండారాలు, కేటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. దైవ, పుణ్యకార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
మిథునం: దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. 
 
కర్కాటకం: ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా వుంటాయి. ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. విందు, వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
 
సింహం: చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వాహనం కొనాలనే ఆలోచన క్రియా రూపంలో పెట్టండి. మీ వాగ్ధాటితో ఎదుటివారిని మెప్పిస్తారు. పెట్టుబడులతో నిదానం అవసరం. సమావేశాలు, బృంద కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు.
 
కన్య: బంధువుల రాకతో ఖర్చులు అధికం. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. మార్కెటింగ్, రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి చికాకులు కలిగిస్తుంది. వస్తువుల కొనుగోళ్ళలో నాణ్యతను గుర్తించాలి. అవసరమైన నిధులు సర్దుబాటు కావడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
తుల: సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. మీ సంతానం అతిగా వ్యవహరించడం వల్ల మాట పడక తప్పదు. హాస్టళ్ల సందర్శన, విహార యాత్రలు అనుకూలిస్తాయి. చిన్నారుల విషయంలో శుభప్రదం. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇంటర్వ్యూల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
 
వృశ్చికం: సినీ రంగాల వారికి కొంత అసౌకర్యం కలుగుతుంది. స్త్రీలు పనివారలకు ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. క్రయ విక్రయాల్లో నాణ్యత గమనించాలి. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ విముక్తులు రావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల కించిత్ ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలమైన కాలం.
 
మకరం: మీ ప్రేమ వ్యవహారాలు మిత్రులకు తెలియజేయడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఒక ప్రణాళిక ప్రకారం వ్యాపారం చేయడం వల్ల పురోభివృద్ధి పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. తప్పనిసరిగా రుణం చేయవలసివస్తుంది. వాహనం అమర్చుకోగలుగుతారు. 
 
కుంభం: వస్త్ర విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. క్షణికోద్రేకం వల్ల స్త్రీలు అపవాదులను ఎదుర్కొంటారు. మీ దగ్గర వ్యక్తుల సహకారం మీకు బాగుగా లభిస్తుంది. నిరుద్యోగులకు జయం చేకూరుతుంది. విద్యార్థులు దురలవాట్లకు లోనయ్యే అవకాశం వుంది. ఎలక్ట్రికల్, టెక్నికల్ రంగాల వారికి కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మీనం: శాస్త్రజ్ఞులకు పరిశోధకులకు, రచనా రంగంల్లోని వారికి రాణింపు లభిస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరకాసుర సంహార క్షేత్రం నరకొత్తూరు, నరకదూరు, నడకుదురు