Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-11-2020 శనివారం దినఫలాలు - సత్యదేవుని ఆరాధించినా...

Advertiesment
14-11-2020 శనివారం దినఫలాలు - సత్యదేవుని ఆరాధించినా...
, శనివారం, 14 నవంబరు 2020 (05:00 IST)
మేషం : ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లోను, కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. 
 
వృషభం : మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా పెద్దగా ఆదాయం ఉండదు. వాగ్ధాటితో అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. 
 
మిథునం : వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ప్రైవేటు సంస్థల్లో పొదుపు క్షేమకాదు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి. దంపతుల మధ్య దాపరికం సమస్యలు తప్పవు. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఏజెన్సీలు, లీజు, కాంట్రాక్టులకు అనుకూలం. 
 
కర్కాటకం : రిప్రజెంటేటివ్‌లు, పత్రికా సిబ్బందికి ఓర్పు, అంకితభావం ప్రధానం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. వ్యవసాయ రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులు, ఆత్మీయులకిచ్చినచ మాట నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. 
 
సింహం : పదవులు, సభ్యత్వాలకు వీడ్కోలు పలుకుతారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. పొదుపు పథకాలు, స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. అనుకున్న పనులు ఏ మాత్రం ముందుకుసాగవు. ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాల్లో బంధువుల ఆదరణ సంతోషం కలిగిస్తుంది. 
 
కన్య : శ్రీమతి వైఖరి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల ఇంటర్వ్యూ కోసం అనుకూలించదు. మీపై వచ్చిన అభియోగాలు, విమర్శలు తొలగిపోగలవు. హమీ, మధ్యవర్తిత్వాలు ఇరకాటానికి గురిచేస్తాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. క్యాటరింగ్ రంగాల వారికి ఆశాజనకం. 
 
తుల : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : ఏజెంట్లు, బ్రోకర్లకు అనుకూలం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యుత్, ఎలక్ట్రికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రుణాలు తీర్చి తాకట్టు విడిపించుకుంటారు. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. 
 
ధనస్సు : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వైద్యరంగాలలో వారికి శుభకార్యములకై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువగా చికాకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు. 
 
మకరం : రాజకీయ నాయకులు అభ్యర్థులతో సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. క్రీడా, కళా రంగాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన ఫలితం పొందుతారు. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. సిమెంట్ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. స్త్రీలు దైవ కార్యక్రమాలలో అందరినీ ఆకట్టుకుంటారు. రిజర్వేషన్ రంగాలవారు సంతృప్తిని పొందుతారు. సలహా ఇచ్చేవారేకాని సహకరించే వారుండరు. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. 
 
మీనం : ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభమవుతుంది. కీలకమైన వ్యవహరాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి నోములు ఎపుడు? లక్ష్మీపూజ ఎపుడు చేయాలి?