ముల్లోకాలను పీడించిన నరకాసుడు జన్మతః భూదేవి పుత్రుడు అతని సంహరించేందుకు శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు. మధ్యలో శ్రీకృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోవడంతో భూదేవి అంశతో జన్మించిన సత్యభామ కదనరంగంలో దిగి నరకాసురుడి పీడ విరగడ చేస్తుంది.
సత్యభామకు భూదేవి అంశ ఉన్నందున - నరకుడు భూమి పుత్రుడు కావటంతో సత్యభామ నరకునికి కృష్ణానది ఒడ్డున పిండప్రదానాలు చేసినట్లు నడకుదురు ఆలయం, చారిత్రక, ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృద్వీశ్వర స్వామి ఆలయ స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. పృద్విశ్వర స్వామి కూడా భూదేవికి ప్రతి రూపంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
నరకాసుర సంహారమునకు వేదికగా నిలిచిన ఈ గ్రామం కాలక్రమంలో నరకదూరు... నడకుదురుగా స్థిరపడినట్లు ఆలయ పండితులు చెబుతుంటారు. ఇంతటి గొప్ప క్షేత్రం మనకు సమీపంలో ఉండటం మన అదృష్టం. శ్రీకృష్ణుడు సత్యభామ విహరించిన పరమ పవిత్ర పాటలీ వనం ఇప్పటికీ ఆలయం పక్కనే ఉంది. పాటలీ వృక్షాలు కాశీలో, నడకుదురులో మాత్రమే కనిపించడం విశేషం.
ఈ వృక్షాలను వేరే చోట్ల పెంచుదామని కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.