Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-11-2020 నుంచి 21-11-2020 వరకు మీ వార రాశి ఫలాలు- video

Advertiesment
15-11-2020 నుంచి 21-11-2020 వరకు మీ వార రాశి ఫలాలు- video
, శనివారం, 14 నవంబరు 2020 (22:18 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వివాహ ప్రయత్నాలు తీవ్రంగా యత్నాలు సాగిస్తారు.ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. మధ్యవర్తులను విశ్వసించవద్దు. గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. మంగళ, బుధ వారాల్లో పనుల్లో ఒత్తిడి. చికాకులు అధికం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరుల మధ్య ఆస్థి వ్యవహారాల ప్రస్తావన వస్తుంది. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఉద్యోగస్తులు ఆందోళన తగ్గి కుదుటపడుతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. కార్మికులు, వృత్తుల వారికి ఆశాజనకం. దైవ కార్యంలో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారి ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. గురువారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. పనివారల నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించాలి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. స్థానచలనం. వేడుకల్లో పాల్గొంటారు. జూదాలు, బెట్టింగుల జోలికిపోవద్దు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు , ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ ఒత్తిళ్లు నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. శుక్ర, శని వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాల ఉన్నతికి దోహదపడుతాయి. గృహంలో మార్పులుచేర్పులకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడుతారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధిక ప్రయోజనకరం. సోమ, మంగళ వారాల్లో పనులు మొండిగా పూర్తిచేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ద వహించాలి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహ మార్పు కలిసివస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. ధన లాభం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ద వహిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పనివారలతో చికాకులు తలెత్తుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం ప్రశాంతత పొందుతారు. ఉమ్మడి వ్యాపారాలు, పెట్టుబడులు కలిసివస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యో గస్తులకు ఒత్తిడి, పనిభారం. మార్కెటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. వినోదాల్లో అత్యుత్సాహం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారంలో అనుకూలతలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. పనుల్లో శ్రమ అధికం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఆప్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. బుధవారం నాడు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభించవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపులు స్థల మార్పు కలిసివస్తుంది. ఉద్యోగ స్తులకు శుభదాయకం. సహద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. తీర్థయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు అదుపులో ఉండవు. గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. మీ శ్రీమతి సలహా పాటించండి. అయిన వారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు లభ్యమవుతాయి. సంతానం విషయాల్లో శుభఫలితాలున్నాయి. గృహ మార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు అదనపు బాధ్యత, ఉపాధి పథకాలపై దృష్టి పెడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కార్మికులు, వృత్తుల వారికి ఆశాజనకం. వేడుకల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమవుతారు. మంచి చేసినా గుర్తింపు ఉండదు. మీ అభిప్రాయాలను అవతలివారు పట్టించుకోరు. ఆత్మీయుల సలహా పాటించండి. సొంత నిర్ణయాలు తగదు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శని, ఆది వారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. కుటుంబీకులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. త్వరలో పరిస్థితులు సర్దుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాథి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ప్రయాణం వాయిదా వేసుకుంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధుత్వాలు బలపడుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. సంతానం చదువులపై మరింత శ్రద్ద అవసరం. అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్దికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. అవకాశాలు చేజారినా మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధన సహాయం తగదు. ఆది, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గృహ మార్పు అనివార్యం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయ పాలన ప్రధానం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఎలా జరిగిందంటే?