Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీటు ఇప్పిస్తానని లైంగిక దాడి చేసిన పాస్టర్

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (17:04 IST)
క్రైస్తవ దేవాలయంలో ఎంతోమంది పాస్టర్‌లు ప్రార్థనలు జరిపిస్తూ మంచి స్థానంలో ఉంటారు. ఇటువటి స్థానంలో ఉండే వారు తమ దేవాలయానికి వచ్చిన వారికి నీతి మార్గాలను బోధిస్తుంటారు. కానీ కొంతమంది కామాందుల వలన ఆ స్థానానికే భంగం వాటిల్లుతున్నది.
 
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే బ్రిడ్జి ప్రక్కన ఓ చర్చి ఉంది. అక్కడ తేళ్ల అపోలో అనే పాస్టర్ ఉన్నాడు. అతను రోజూ ప్రార్థనలు చేయడం, పిల్లలకు ట్యూషన్ చెప్పడంతో మంచివాడుగా గుర్తింపు పొందాడు. అక్కడి స్థానికురాలైన నాలుగో తరగితి అమ్మాయి అతని దగ్గర ట్యూషన్ రావడంతో చిన్నారిపై పాస్టర్ కన్ను పడింది. ఆ చిన్నారిని ఏలాగైనా లొంగదీసుకోవాలని పథకం పన్నాడు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు లేకపోవడంతో దాన్నే అదనుగా మార్చుకు డు.
 
ఆమె అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటోంది. దీంతో సమయాని కోసం ఎదురుచూసిన పాస్టర్ అమ్మాయికి స్వీటు ఇప్పిస్తానని చెప్పి ఆమెపై లైంగిక దాడి చేశాడు. తర్వాత ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. పాస్టర్ బాలికపై చేసిన అఘాయిత్యాన్ని ఆమె స్నేహితులు చిన్నారి పిన్నికి సమాచారం అందించారు.
 
ఈ ఘటనపై ఆదివారం దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నింధితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. స్థానికుల మధ్య ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. దీంతో ప్రజా సంఘాలు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం