Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేన్సర్ రోగి కోరిక తీర్చేందుకు గబ్బిలంలా మారిపోయిన వైద్యుడు...

Advertiesment
కేన్సర్ రోగి కోరిక తీర్చేందుకు గబ్బిలంలా మారిపోయిన వైద్యుడు...
, ఆదివారం, 15 నవంబరు 2020 (18:22 IST)
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన ఐదేళ్ళ చిన్నారి కేన్సర్ బారినపడి స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆ చిన్నారిని నీ అతి పెద్ద కోరిక ఏంటి అని అడిగినప్పుడు... ఆ చిన్నారి తన అభిమాన సూపర్‌ హీరో బ్యాట్‌మెన్‌ను‌ కలవాలన్న కోరిక వెల్లడించాడు. 
 
అంతే.. ఆ చిన్నారి కోరికను తీర్చేందుకు వైద్యుడు బ్యాట్‌మెన్‌‌ దుస్తులు ధరించి ఆస్పత్రి కారిడార్‌లో చిన్నారికి ఎదురుగా వచ్చాడు. ఆ చిన్నారిని దగ్గరకు పిలిచి తనని హత్తుకొమ్మని అడిగాడు. ఆ బాలుడు హత్తుకోగానే... నిన్ను ఇబ్బంది పెడుతున్న మహమ్మారితో ధైర్యంగా పోరాడు అంటూ  ధైర్యాని నింపాడు.
 
ఈ వీడియో షేర్‌ చేసిన గంట వ్యవధిలోనే వేలల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. 'నేను దీన్ని పదిసార్లు చూశాను.. చూసిన ప్రతిసారి భావోద్యేగానికి లోనయ్యాను', 'ఈ వైద్యుడిని అతడి కుటుంబాన్ని దేవుడు ఆశ్వీర్వాదించాలని, ఆ దేవుడు చిన్నారిని కేన్సర్‌ నుంచి స్వస్థపరచాలని వేడుకుంటున్న' అంటూ నెటిజన్లు తమకు తోచినవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. దీంతో ఆ వైద్యుడి‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 44 సెకన్‌ల నిడివి గల ఈ వీడియోలో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఫీల్‌‌గుడ్‌ అనే ట్విటర్‌ పేజీలో శనివారం షేర్‌ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ అగ్ర నేతల కోరిక మేరకే.. సీఎంగా ప్రమాణం చేస్తున్నా : నితీశ్