మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ - ముగ్గురు మావోల హతం

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (14:04 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటరురో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలోని లోదంగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒకరు మహిళ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మావోయిస్టులపై రూ.30 లక్షల వరకు రివార్డు ఉంది. 
 
"మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ జిల్లా బహేలా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వారి ముగ్గురిపైనా రివార్డ్‌ ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది" అని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించారు. 
 
చనిపోయిన వారిలో డివిజినల్‌ కమిటీ సభ్యుడు నగేష్‌పైన రూ.15 లక్షల రివార్డు ఉండగా.. ఏరియా కమాండర్‌ మనోజ్‌తోపాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల క్యాష్‌ రివార్డు ఉన్నట్లు వివరించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్లు హోంమంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments