Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ కేటుగాళ్లు : సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసిన యువతి నుంచి 40 వేలు కొట్టేశారు! ఎలా?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (13:04 IST)
ఇన్నాళ్లూ లాటరీ గెలుచుకున్నారు... ఇంత మొత్తం మా ఖాతాలో జమ చేయండి.. తర్వాత గెలుపొందిన మొత్తాన్ని పంపేస్తాము అంటూ ఫోన్‌లు చేసి డబ్బులు కొట్టేసిన బ్యాచ్‌లనే చూసాం. ఈ మధ్య బ్యాంక్ సిబ్బంది పేరు చెప్పుకొని ఓటీపీలతో డబ్బులు కొట్టేసిన వాళ్లనీ చూసాం. అయితే.. ఓ సినిమా టిక్కెట్లు బుక్ చేసుకొని ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న యువతికి డబ్బు పంపుతామని వివరాలు తీసుకొని డబ్బు కొట్టేసిన ఘటన లక్నోలో చోటుచేసుకుంది.
 
వివరాలలోకి వెళ్తే... యూపీ రాజధాని లక్నో పరిధిలోని జానకీపురంలోని బాధితురాలు, పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు, ఓ యువతి ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను బుక్ చేసుకుంది. ఆపై సినిమాకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాటిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ డబ్బు తిరిగి ఆమె ఖాతాకు జమ కాకపోవడంతో, కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసింది. వారు డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. 
 
ఆపై కొన్ని రోజులకు తాను టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ నుంచి మాట్లాడుతున్నానంటూ, ఫోన్ చేసిన వ్యక్తి, డబ్బులు తిరిగి ఖాతాలో జమ చేయడానికి డెబిట్ కార్డు వివరాలు కావాలని కోరడంతో, ఆమె వాటిని అందజేసింది. ఆపై నిమిషాల్లోనే సదరు యువతి బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు ఎగిరిపోయాయి. దీంతో ఆమె తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments