వివాదాస్పద అయోధ్య అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అయోధ్య అంశంపై ఏసీ గదుల్లో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేది అంటూ ప్రశ్నించారు.
రామమందిరం నిర్మాణంపై ఢిల్లీ, లక్నోలోని ఏసీ గదుల్లో కూర్చుని నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో సామాన్యుల జీవనస్థితిని ఓసారి చూడాలని మీడియాను కోరారు. ఈ రకమైన రాముడి రాజ్యాన్ని వీళ్లు తీసుకుని రావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
కాగా, ప్రకాష్ రాజ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో బీజేపీ నేతలపై ప్రకాష్ రాజ్ విమర్శనాస్త్రాలను తీవ్రస్థాయిలో ఎక్కుపెట్టారు.