ఓటుకు డబ్బు తీసుకున్న యువకుడు.. ఓటు రద్దుతో ఆ పని చేశాడు..

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:09 IST)
మనకు మంచి జరగాలంటే మంచి నాయకుడు అధికారంలోకి రావాలని దాని కోసం మన ఓటును సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అదే విధంగా ఆశపడిన ఓ యువకుడికి ఓటు రద్దు చేయడంతో ఆందోళన చెందాడు. తన ఓటును తనకు తిరిగి ఇవ్వాలని నిరసనకు దిగాడు. ఇందు కోసం సెల్ టవర్ పైకి ఎక్కి, దూకి ఆత్మహత్య చేసుకుంటానని అందరినీ భయపెట్టాడు. 
 
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్‌లో ఈ ఘటన జరిగింది. కంగారు పడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలిసులు రంగంలోకి దిగి అతడిని శాంతపరిచి కిందకుదింపారు. టవర్‌పైకి ఎక్కిన యువకుడు కిస్మత్‌పూర్‌కు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటును అన్యాయంగా తీసివేసారని, తనకు ఓటు కల్పించమని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన చెందాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని విన్నవించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రైలు డ్రైవర్ సాహసం : కారం పడిన కళ్లతోనే...