Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటు.. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి..?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:28 IST)
ఉత్తరప్రదేశ్‌లోని డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటును ఎంచుకున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన స్మగ్లర్లలో ఒకరు ఆగ్రా నివాసి కాగా, మరొకరు ఫరూఖాబాద్‌కు చెందినవారు. 
 
ఎల్‌పీజీ సిలిండర్లతో బైక్‌పై మెయిన్‌పురి పరిధిలోని బిచ్వాన్ ప్రాంతం గుండా వెళ్తున్నారు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా యువకులిద్దరూ ఖాకీలను తప్పుదోవ పట్టించారు. వారి మాటలు తేడాగా ఉండటంతో పోలీసులు గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించగా దాని బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. 
 
దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇద్దరు యువకులను గట్టిగా విచారించగా, సిలిండర్‌లో గంజాయి నింపినట్లు అంగీకరించారు. నిందితులను లఖన్, శివమ్‌లుగా గుర్తించారు. పట్టుబడిన స్మగ్లర్ల వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments