దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1053గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ప్రభుత్వ సంస్థ ఇండేన్ ద్వారా రూ.750లకే సిలిండర్ ఇస్తున్నారు.
ఇది కాంపోజిట్ సిలిండర్. అందుకే తక్కువ ధరకు వస్తుంది. సులభంగా ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేసుకోవచ్చు. త్వరలో ఈ సిలిండర్ సదుపాయాన్ని అన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. నగరాల్లో ఉండే ప్రజలు ఈ సిలిండర్‌ను పొందవచ్చు. లేకపోతే కొన్ని రోజులు వేచి ఉండవచ్చు.
కాంపోజిట్ సిలిండర్లు బరువు తక్కువగా ఉంటాయి. అందులో 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. ఈ కారణంగా ఈ సిలిండర్ల ధర తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిలిండర్లు ఢిల్లీ సహా మొత్తం 28 నగరాలకుపైగా అందుబాటులో ఉంది.