Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీఎస్సార్టీసీ... కార్గో, పార్శిల్‌ సర్వీసుల ద్వారా?

Advertiesment
tsrtc bus
, గురువారం, 28 జులై 2022 (15:22 IST)
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాఖీ  పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది.
 
టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసులను హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ  సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది.
 
మరోవైపు బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూసే పని లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా బస్సు ఎక్కడుంది? ఎప్పుడు వస్తుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 'టీఎస్‌ ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌' పేరుతో గూగుల్‌ ప్లే స్టోర్‌లో మొబైల్‌ యాప్‌ను సంస్థ వైస్‌ చైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ఇటీవలే ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17 ఏళ్లు నిండిన యువతకు ఓటర్‌ కార్డు..