లోకంలో స్త్రీ అన్నిరంగాల్లోనూ ముందడుగు వేస్తున్నా... మహిళల్ని కించపరిచే పరిస్థితీ మారలేదు. దేశంలో పెరుగుతున్న మాంసం ధరలకు మహిళల తొడల "బాధ్యత" వహించాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
కిర్గిజాస్థాన్ నుండి అవార్డు గెలుచుకున్న మౌలానా సాదిబాకాస్ డూలోవ్ అనే ఈ వ్యక్తి, మహిళలు పొట్టి దుస్తులను ధరించకుండా ఆపాలని, "ఈ అవమానానికి" ముగింపు పలకాలని వృద్ధులకు పిలుపునిచ్చారు.
"నగరంలో మాంసం ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలుసా? మహిళల మాంసం చౌకగా ఉన్నప్పుడు పెరుగుతుంది. స్త్రీ మాంసం చౌకగా మారేది, ఆమె చర్మం బయటపెట్టినప్పుడు.. బొటనవేలు బయటపెట్టినట్లు ఆడవాళ్లు తొడలను బహిర్గతం చేస్తున్నారు," అని డూలోవ్ ఒక మీడియా వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.
ఇటీవల బిష్కెక్ నగరంలోని ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, డూలోవ్ చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల చూపుతున్న తీవ్రమైన 'వివక్ష'కు నిదర్శనం అంటూ పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.