Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఓయో రూమ్స్‌ రెడీ

Advertiesment
students
, గురువారం, 14 జులై 2022 (14:39 IST)
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్‌ ఎగ్జామ్‌ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్‌ అందిస్తుంది. అందులో  వైఫై, ఎయిర్‌ కండీషనింగ్‌ సౌకర‍్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కన్జ్యూమర్‌)  శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు.
 
ఇకపోతే..  దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్‌ ఎగ్జామ్‌-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్‌ ఎగ్జామ్‌ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్‌ పై 60 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరీక్షా సమయానికి హాలుకు రాలేక విద్యార్థులు పడే కష్టాల నుంచి తప్పుకోవచ్చునని ఓయో తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించనున్న ప్రధాని మోడీ