Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంగన్‌వాడీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి

Dr Siri
, శనివారం, 2 జులై 2022 (16:53 IST)
అంగన్ వాడీల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని అంగీకరించబోమని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకపోతే కఠిన చర్యలకు తప్పవని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి హెచ్చరించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పధకాలు పూర్తి స్దాయిలో అర్హులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని, రికార్డుల నిర్వహణ మొదలు ఆహార సరఫరా వరకు ఏ విషయంలోనూ అలసత్వం కూడదని స్పష్టం చేసారు.

 
పల్నాడు జిల్లా గురజాల ఐసిడిఎస్ ప్రాజెక్ట్‌ పరిధిలోని గురజాల-2, దుర్గి-5 అంగన్‌వాడీ కేంద్రాలను డాక్టర్ సిరి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆయా కేంద్రాలను సందర్శించిన సంచాలకురాలు గర్భిణీ, పాలిచ్చే తల్లుల స్పాట్ ఫీడింగ్, నాణ్యమైన ఆహారం తదితర అంశాలపై ఆరా తీసారు. ప్రీ-స్కూల్ విధానం అమలు, గ్రోత్ మానిటరింగ్, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్‌లు, శానిటేషన్ తదితర అంశాలపై కూడా అధికారులతో చర్చించారు.

 
ఆయా కేంద్రాలలో తల్లులు, పిల్లలతో మాట్లాడి యోగక్షేమాలను విచారించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు వేడిగా వండిన భోజనం పంపిణీ శుక్రవారం నుండి పునఃప్రారంభించబడగా, ఆయా అంశాల పట్ల డాక్టర్ సిరి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీ నేపధ్యంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో రిజిస్టర్‌లు నవీకరించబడని విషయాన్ని గుర్తించారు. దుర్గి-5 కేంద్రంలో స్టాంపింగ్ లేకుండా గుడ్లు, గురజాల-2 లో పాత స్టాక్ ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇసిసిఇ కార్యకలాపాలు నిర్వహించడం లేదన్న విషయాన్ని గుర్తించి సిబ్బందిని హెచ్చరించారు.

 
ప్రీ-స్కూల్ హాజరు తక్కువగా ఉండగా దానిని మెరుగుపరచాలని సూచించారు. పిల్లల తల్లులతో మదర్స్ గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ రెండు కేంద్రాలలోనూ పిల్లల గ్రోత్ మానిటరింగ్, సంపూర్ణ పోషణ, పోషణ ట్రాకర్ అప్లికేషన్‌లలో వివరాలను అప్‌డేట్ చేయక పోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ సిరి, పనితీరు మార్చుకోకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ ఘన స్వాగతం.. రేవంత్ రెడ్డికి షాక్