Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగన్‌వాడీల నిర్వహణలో అవకతవకలపై కఠిన చర్యలు: డాక్టర్ సిరి

Advertiesment
Siri
, శుక్రవారం, 17 జూన్ 2022 (22:14 IST)
అంగన్‌వాడీల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకున్నా తీవ్రమైన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్, లాం సెక్టార్ పరిధిలోని దామపల్లి అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం డాక్టర్ సిరి సందర్శించారు.

 
గ్రోత్ మానిటరింగ్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ప్రీ-స్కూల్ కార్యకలాపాలను పరిశీలించారు. ప్రీ-స్కూల్ హాజరును మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం నిర్దేశించిన పుస్తకాలను (వర్క్ బుక్స్, యాక్టివిటీ బుక్స్, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్) టైమ్ టేబుల్ ప్రకారం ఉపయోగించాలన్నారు. రోగనిరోధకత, ఆరోగ్య పరీక్షలు, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులతో మాట్లాడిన సిరి, ప్రభుత్వం అందించిన ప్రీ-స్కూల్ మెటీరియల్ సమగ్ర వినియోగం గురించి చిన్నారులకు వివరించాలన్నారు.

 
ప్రీ-స్కూల్ పిల్లల తల్లులతో మదర్స్ గ్రూప్‌లు ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు తల్లులతో ప్రీ-స్కూల్ కార్యకలాపాల విశేషాలను పంచుకోవాలని సూచించారు. అధిక ప్రమాదం ఉన్న గర్భిణీ తల్లులు, పిల్లల ఇళ్ల సందర్శనలు ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయాలన్నారు. గ్రోత్ మానిటరింగ్ సక్రమంగా చేసి ఖచ్చితమైన డేటాను రికార్డ్ చేయాలన్నారు.


గ్రోత్ మానిటరింగ్ వివరాలు, ప్రీ-స్కూల్ హాజరు డేటాను పోషణ్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అప్లికేషన్‌లలో రోజువారీగా అప్‌డేట్ చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో, చుట్టుపక్కల సరైన పారిశుధ్యం ఉండేలా చూసుకోవాలని, అర్హులైన పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు అందించాలని డాక్టర్ సిరి స్పష్టం చేసారు. షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వేడిగా ఆహారం సిద్దం చేయాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Father's Day: ఓ నాన్నా... నీ మనసే వెన్నా... అమృతం కన్నా అది ఎంతో మిన్నా....