క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం.. బ్లడ్ ఇన్‌పెక్షన్‌తో..

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:30 IST)
రాంచీ: రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సైతం నిలకడగా లేవని వైద్యులు చెబుతున్నారు. బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 
 
పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. రిమ్స్‌లో లాలూ చేరినప్పటి నుంచి ఆయనకు డాక్టర్ డీకే ఝా వైద్యచికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బ్లడ్ ఇన్‌పెక్షన్ లాలూ శరీరంలో వ్యాపించిందని, ఆయన కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని డాక్టర్ ఝా తెలిపారు.
 
యాంటీబయోటిక్ మెడిసన్లు కారణంగా కూడా ఆయన కిడ్నీ పనితీరు మందగించిందన్నారు. లాలూ తీసుకునే డైట్ కూడా గతంలో కంటే తగ్గిందని, ప్రస్తుతం మందులు ఇస్తున్నామని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యబృందంలో ఒకరైన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments