వాషింగ్టన్ వైట్ హౌస్ వద్ద సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ "కాశ్మీర్‌లో మారణకాండ ఆపాలని, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, మానవ హక్కులు ట్రంప్ సొంతం కాదని, కాశ్మీర్‌కు న్యాయం చేయాలనే" నినాదాలతో సాగిన నిరసనల్లో పాల్గొన్నారు.
ఇంకా ఈ నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. ప్రపంచ గుత్తాధిపత్యం కలిగిన అమెరికా వైట్ హౌస్‌కి కేవలం 100 మీటర్ల దూరంలో నిరసనలు తెలిపేందుకు అవకాశం ఉంది.
కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం 10 కిలోమీటర్ల దూరంలో నిరసనలు తెలిపినా ఆయా ప్రభుత్వాలు నేరంగా పరిగణిస్తుండటం దుర్మార్గమని చెప్పుకొచ్చారు. ఇది ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని కె. నారాయణ అన్నారు.