Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ రాజకీయాలు నవ్వు నవ్వు.. కేంద్రానికి బానిసగా మారిన సర్కారు: ఖుష్బూ ఫైర్

తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:54 IST)
తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మిళ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం వెర్రివాళ్ల‌ను చేస్తోంద‌ని కమల్ హాసన్ ట్వీట్ చేసిన తరుణంలో... తమిళ రాజకీయాలను చూసి ప్రపంచం నవ్వుతోందని అన్నారు. నాలుగేళ్లు కేంద్రానికి తమిళనాడు సర్కారు బానిసగా ఉంటుందన్నారు.
 
బీజేపీ ఒత్తిడితోనే పన్నీరు, పళని వర్గాలు విలీనమయ్యాయని, అన్నాడీఎంకే వర్గాల విలీనంలో ఆశ్చర్యపడాల్సిందేమీలేదని ఖుష్బూ వ్యాఖ్యానించారు. పన్నీర్‌ సెల్వం, పళనిస్వామికి వేరే అవకాశం లేక విలీనమయ్యారని తేల్చిచెప్పారు. నిన్నటి దాకా తిట్టుకున్న నేతలు ఇప్పుడెలా ఏకమయ్యారని ప్రశ్నించారు. 
 
ఈ విలీనం వల్ల ప్రజలకు ఒరిగేదేముందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో అడుగు పెట్టేందుకు బీజేపీకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్లే ఇలాంటి రాజకీయాల ద్వారా పాగా వేయాలని కుయుక్తులు పన్నుతోందని ఖుష్బూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments