Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీలో కొనసాగాలా? వద్దా..? పదవికి రాజీనామా చేస్తా: అఖిల ప్రియా రెడ్డి

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగాలో వద్దో తేల్చుకోవాలంటూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి స్పందించారు. తాను వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి

Advertiesment
టీడీపీలో కొనసాగాలా? వద్దా..? పదవికి రాజీనామా చేస్తా: అఖిల ప్రియా రెడ్డి
, సోమవారం, 21 ఆగస్టు 2017 (08:53 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగాలో వద్దో తేల్చుకోవాలంటూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి స్పందించారు. తాను వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి మారి, ఆపై మంత్రి పదవిని దక్కించుకున్నట్టు జగన్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... అవసరమైతే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరితే ఇప్పటికిపుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 'పదవి మీద నాకేమీ ఆశలేదు. ప్రజలు నా వైపున ఉన్నారనే నమ్మకం నాకు ఉంది.. 2019లో అది నిరూపితమవుతుంది. రాజీనామా చేయమని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెబితే చేస్తాను అని ప్రకటించారు. 
 
అదేసమయంలో తన తండ్రి మరణంతో జరగుతున్న నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా తండ్రి భూమా నాగిరెడ్డిపై శిల్పామోహన్ రెడ్డి గతంలో చాలా కేసులు పెట్టారు. భూమా ఒక బ్రాండ్.. ఆ పేరు నిలబెడతాం. ప్రతిపక్షంలో ఉండలేక టీడీపీలో చేరామన్నది నిజం కాదు. పదవి కోసం.. మా నాన్న చనిపోయన మర్నాడే నేను అసెంబ్లీకి వెళ్లానన్నది కరెక్ట్ కాదు. మా నాన్న లక్ష్యాలేంటో చెప్పేందుకే ఆ రోజున అసెంబ్లీకి వెళ్లాను’ అని ఆమె వివరణ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీకకోసి చంపేస్తారట : కమెడియన్ వేణుమాధవ్ ఫిర్యాదు