అందుకే పవన్ కళ్యాణ్ తెదేపాకు హ్యాండిచ్చారు... అంబటి రాంబాబు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వుంటానని ప్రకటించడంపై వైసీపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మూడున్నరేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరలేదనీ, పైగా ప్రత్యేక హోదాను సాధి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వుంటానని ప్రకటించడంపై వైసీపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మూడున్నరేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరలేదనీ, పైగా ప్రత్యేక హోదాను సాధించాల్సిందిపోయి నీరుగార్చారని అంబటి విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా తేదెపా నెరవేర్చలేదన్నారు. ఇవన్నీ తెలుసుకున్నందునే పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకుని వుంటారని చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్లు తెరిచి తన తప్పులు సరిదిద్దుకుంటే మంచిదని అన్నారు.