Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బట్టలు వేసుకోనివారు మాట్లాడే మాటలు పట్టించుకోనక్కర్లేదు... రోజాపై ఆది సంచలన కామెంట్స్

నంద్యాల ఉప ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఏకంగా వ్యక్తిగత విమర్శలకు ఇరు పార్టీ నేతలు దిగుతున్నారు. ఎమ్మెల్యే అయిన అఖిలప్రియ చుడీదార్ వేసుకుని అసెంబ్లీకి రావడమేమిటి.. పద్ధతిగా చీర కట్టుకుని రావచ్చు కదా అని రోజా చేసిన వ్యాఖ్యలపై తెదేపా నాయకులు తీవ్ర వ్యాఖ

Advertiesment
AP minister
, శనివారం, 12 ఆగస్టు 2017 (15:58 IST)
నంద్యాల ఉప ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఏకంగా వ్యక్తిగత విమర్శలకు ఇరు పార్టీ నేతలు దిగుతున్నారు. ఎమ్మెల్యే అయిన అఖిలప్రియ చుడీదార్ వేసుకుని అసెంబ్లీకి రావడమేమిటి.. పద్ధతిగా చీర కట్టుకుని రావచ్చు కదా అని రోజా చేసిన వ్యాఖ్యలపై తెదేపా నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
రోజాను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ... బట్టలు వేసుకోనివారు మాట్లాడే మాటలు పట్టించుకోనక్కర్లేదనీ, వాళ్లు నీతులు చెప్తారా అంటూ మండిపడ్డారు. నంద్యాలలో తెదేపే గెలుపు ఖాయమని ఆయన అన్నారు. మరోవైపు అఖిలప్రియపై రోజా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో అయితే రోజా తాలూకు చిత్రాల బొమ్మలు, బికినీల్లో వున్న రోజా ఫోటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. 
 
ఇన్ని వేషాలు వేసిన రోజా, అఖిలప్రియ వస్త్ర అలంకరణపై మాట్లాడటమా అని నిలదీస్తున్నారు. మొత్తమ్మీద రోజా చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు పార్టీకి లాభపడితే మరికొన్నిసార్లు తీవ్రంగా ఇరుకున పెడుతున్నాయి. మరీ ఈ వ్యవహారంపై పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంటుకు రారా? మీ సంగతి 2019లో చూస్తా : బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్