Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంటుకు రారా? మీ సంగతి 2019లో చూస్తా : బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్

సొంత పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టివార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్‌కు రాకుండా వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటున్న వారిని మోడీ నేరుగా హెచ్చరించారు. పార్లమెంట్‌కు రారా.. 2019లో మీ

పార్లమెంటుకు రారా? మీ సంగతి 2019లో చూస్తా : బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్
, శనివారం, 12 ఆగస్టు 2017 (15:21 IST)
సొంత పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టివార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్‌కు రాకుండా వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటున్న వారిని మోడీ నేరుగా హెచ్చరించారు. పార్లమెంట్‌కు రారా.. 2019లో మీ సంగతి చూస్తా.. మళ్లీ పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వనంటూ తెగేసి చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు సందర్భంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధాని మోడీ ఎంపీలపై కన్నెర్రజేశారు. ఎంపీల తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. 
 
'మీరు పార్లమెంటుకు ఎందుకు ఎన్నికయ్యారు? సభకు హాజరుకావడానికా లేక సంతకం చేసి ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికా? మీలాగే పార్టీలో సేవ చేసిన వారు చాలామంది ఉన్నారు. వారందర్నీ కాదని మీకు సీట్లు ఇచ్చి గెలిపిస్తే పార్లమెంటుకు సరిగ్గా హాజరు కాకపోవడం శోచనీయం. మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే 2019లో మా ఇష్టం వచ్చినట్లు మేం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది' అంటూ హెచ్చరించారు. 
 
ఇకపై ఎంపీల ఆటలు సాగవన్న అర్థం వచ్చేలా మాట్లాడిన ప్రధాని రాబోయే ఎన్నికల్లో ఎంపీల పని తీరు ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని తేల్చి చెప్పారు. గతంలో ఇవే విషయాలను అమిత్‌ షా ఎంపీలకు చెప్పినా పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రధాని ఎంపీలతో కటువుగా మాట్లాడాల్సి వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఓబీసీ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు సీనియర్‌ మంత్రులతో పాటు 31 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. దీన్ని ప్రధాని జీర్ణించుకోలేక పోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఏనుగు చేసింది అమోఘం... పెయింట్ బ్రష్‌తో ఏం చేసిందో చూడండి(వీడియో)