Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరిలో దారుణం.. ప్రియుడుతో "ఆ" సంబంధం వద్దన్నాడనీ...

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:47 IST)
ఇటీవలి కాలంలో పలువురు మహిళలు భార్య అనే పదానికే మచ్చ తెస్తున్నారు. పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తలను కడతేర్చుతున్నారు. తాజాగా కదిరి పట్టణంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రియుడిపై మోజుపడిన ఓ మహిళ.. కట్టుకున్న భర్తను చంపేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్ల కదిరి పట్టణంలో నివాసం ఉంటున్న నాగభూషణం, ఈశ్వరమ్మ అనే భార్యాభర్తలు. గత కొన్నేళ్లుగా కదిరి పట్టణంలో నివాసముంటున్నారు. ఇటీవల నాగభూషణం భార్య ఈశ్వరమ్మకు ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే రవి కుమార్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
ఈ వ్యవహారం భర్త నాగభూషణంకు తెలియడంతో భార్య ప్రవర్తన మార్చుకోవాలని పలు సార్లు మందలించినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలాగైనా తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఈశ్వరమ్మ ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్‌తో భర్త నాగభూషణం దారుణంగా హత్య చేసారు. 
 
గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో మనుషులతో ఆటోలో మృతదేహాన్ని కదిరి పట్టణ సమీపంలోని ముళ్ళ పొదల్లో మృతదేహాన్ని పూడ్చి ఏమి విరిగినట్లు నటిస్తూ భర్త గురించి అడిగిన బంధువులకు చెన్నైలో ఉన్నాడని చెబుతూ వచ్చింది.
 
రోజులు గడుస్తున్నా.. అదే సమాధానం చెబుతూ ఉండటంతో భార్య ఈశ్వరమ్మ ఏదో చేసిందని అనుమానించిన బంధువులు పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసు తనదైన శైలిలో విచారించారు. 
 
దీంతో ఈశ్వరమ్మ ప్రియుడు రవికుమార్ కలిసి తన భర్తను చంపినట్లు అంగీకరించి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన చోట చూపించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేపట్టారు కదిరి పోలీసులు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments