Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందమైన భార్యను అనుమానంతో చంపేసాను: పోలీసు స్టేషన్లో నిందితుడు

Advertiesment
అందమైన భార్యను అనుమానంతో చంపేసాను: పోలీసు స్టేషన్లో నిందితుడు
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:59 IST)
అనుమానం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అందమైన భార్యను చేజేతులా చంపుకున్నాడు. అతి దారుణంగా చంపేశాడు. ఆ తరువాత నిజం తెలుసుకుని బాధపడుతున్నాడు భర్త. భార్య ఏ తప్పు చేయలేదని.. తనే అనవసరంగా ఆవేశానికి గురయ్యాయని తెలుసుకుని కుమిలిపోతున్నాడు.
 
జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య ముంబైలో కల్లు దుకాణంలో పనిచేస్తున్నాడు. శంకరయ్యకు ఇద్దరు పిల్లలు. భార్య సుజాత ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే మూడు నెలల క్రితం శంకరయ్య తన భార్యతో ప్రొవిజన్ షాప్ పెట్టించాడు. దీంతో ఆమె వ్యాపారం చూసుకుంటూ ఉండేది. నెలకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ఐతే భార్య ఎవరితోనే కలుస్తోందన్న అనుమానం అతనిది.
 
భర్తలో వస్తున్న అనుమానాన్ని కనిపెట్టింది భార్య సుజాత. తను మీ భార్యనని.. ఎవరితోను కలవడం లేదని చెబుతూ వచ్చింది. అయినా శంకరయ్యలో మాత్రం అనుమానం పోలేదు. బిడ్డలపైన ఒట్టు వేసినా నమ్మలేదు. ప్రొవిజన్ షాపుకు వచ్చేవారు మాట్లాడుతున్నారే తప్ప తాను ఎవరితోను కలవలేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. 
 
దీంతో ఆగ్రహంతో ఇంటికి వచ్చిన శంకరయ్య.. ఉదయం బాత్రూంకు వెళ్ళి బయటకు వస్తున్న భార్యను గొడ్డలితో ఒక్క పెట్టున నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చనిపోయిన భార్య దగ్గరే గంటకు పైగా కూర్చున్నాడు. ఆమె చనిపోయిందని తెలుసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.  
 
అయితే తన స్నేహితుల ద్వారా శంకరయ్య అసలు విషయం తెలుసుకున్నాడట. నీ భార్య చాలా మంచిది. ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడదు. ఎవరితోను కలవదని తెలుసుకున్న శంకరయ్య కన్నీటి పర్యంతమవుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడట. చేజేతులా తన భార్యన చంపుకున్నానని బాధపడుతున్నాడట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉడాన్‌ పైన కోటి రూపాయల వ్యాపార లావాదేవీలను నిర్వహించిన 250కు పైగా విక్రేతలు