Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో ఆరోగ్య మంత్రి - తమిళనాడులో రవాణా మంత్రికి కరోనా

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (08:57 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ బారి నుంచి ప్రజాప్రతినిధులు సైతం తప్పించుకోలేకపోతున్నారు. దీంతో రోజురోజుకూ ఈ వైరస్ బారినపడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. తాజాగా ‌జార్ఖండ్ ఆరోగ్య‌శాఖ మంత్రి బ‌న్న గుప్తా, తమిళనాడు రవాణా శాఖామంత్రి విజయభాస్కర్‌లు ఈ వైరస్ బారినపడ్డారు.  
 
జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజటివ్ అని మంగ‌ళ‌వారం ‌రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత ట్విట‌ర్‌లో ప్ర‌క‌టించారు. గ‌త వారం రోజుల్లో త‌నను క‌లిసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. తాను క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, అందులో పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు.
 
క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ప్ప‌టికీ మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశానికి గుప్తా హాజ‌ర‌య్యారు. వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బాద‌ల్ ప‌త్ర‌లేఖ్‌తో క‌లిసి ఆయ‌న కూర్చున్నారు. దీంతో ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌తో స‌హా స‌మావేశానికి హాజ‌రైన అంద‌రు క్వారంటైన్ వెళ్లానున్నారు. 
 
అలాగే, తమిళనాడు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్‌ మంగళవారం కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా మంగళవారం 5,709 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, మొత్తం 3,49,654కు చేరాయి. బాలిక సహా మరో 121 మంది తాజాగా మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 6,007కు చేరింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments