Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆది పినిశెట్టితో పెళ్లంటూ వార్తలు.. ఇంతలో నిక్కీ గ‌ల్రానీకి కరోనా పాజిటివ్..

Advertiesment
ఆది పినిశెట్టితో పెళ్లంటూ వార్తలు.. ఇంతలో నిక్కీ గ‌ల్రానీకి కరోనా పాజిటివ్..
, శుక్రవారం, 14 ఆగస్టు 2020 (09:52 IST)
Nikki Galrani
టాలీవుడ్ హీరో ఆది పినిశెట్ట త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్తలు వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నిక్కీ గ‌ల్రానీని ఆది పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు త‌మిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం న‌డుస్తోంది. ప్ర‌ముఖ హీరోయిన్ సంజ‌న సోద‌రినే నిక్కీ గ‌ల్రానీ. వీరిద్ద‌రూ గ‌త కొంత‌కాలంగా ప్రేమలో ఉన్నట్లు త‌మిళ మీడియాలో పలు మార్లు పుకార్లు వ‌స్తున్నాయి. 
 
వీరిద్దరు మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించగా.. అవి రెండు మంచి విజయాన్ని సాధించాయి. ఆ క్రమంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డట్లు టాక్ నడిచింది. ఇక వీటన్నింటికి బలం చేకూరుస్తూ.. ఇటీవల ఆది ఫ్యామిలీ ఫంక్షన్‌లో భాగమైంది నిక్కీ. దీంతో వీరిద్దరి పెళ్లి అంత సిద్ధమని వార్తలొచ్చాయి. కానీ ఇంతలో నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. గత వారం తనకి కరోనా సోకగా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది. 
 
''నాకు గొంతు నొప్పి, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించాయి. వైద్యుల సూచనలతో కోలుకుంటున్నాను. ఇంట్లోనే క్షేమంగా, సురక్షితంగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న వారికి, వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు అని నిక్కీ పేర్కొంది. నేను యంగ్ ఏజ్‌లో ఉన్నాను, ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది కాబట్టి కరోనా నుండి కోలుకుంటానని ఆశిస్తున్నాను. 
 
కాని నా తల్లిదండ్రులు, స్నేహితులకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించడం మరచిపోవద్దు. అవసరమైతేనే బయటకు వెళ్లండి. ఎల్లప్పుడు ఇంట్లో ఉన్న బోర్ వస్తుంది, అయినప్పటికి సమాజం కోసం మనవంతు సాయం చేయాల్సిన సమయం ఇది. కుటుంబంతో సరదాగా గడపండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి'' అంటూ నిక్కీ స్పష్టం చేసింది. తెలుగులో సునీల్ సరసన కృష్ణాష్టమి సినిమాలోనూ నిక్కీ నటించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ సినిమా ఆగిందా? అందుకే.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ లైన్లోకి వచ్చాడా?