Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుశాంత్‌ది హత్యే.. అమ్మ పోయింది.. అంటూ లేఖ రాసిన.. సుశీ ఫ్యామిలీ

సుశాంత్‌ది హత్యే.. అమ్మ పోయింది.. అంటూ లేఖ రాసిన.. సుశీ ఫ్యామిలీ
, బుధవారం, 12 ఆగస్టు 2020 (17:25 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదనీ.. కచ్చితంగా ''హత్యే''నని ఓ లేఖలో ఆరోపించారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖను అమ్మ పోయింది.. అంటూ లేఖను ప్రారంభించారు. సుశాంత్ తల్లి గర్వించేలా అతడిని పెంచామని ఆ లేఖ పేర్కొంది. 
 
నటనారంగంలో మంచిగా రాణించే సత్తా కలిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దాదాపు 8 నుంచి 10 ఏళ్ల పాటు తన కలల ప్రపంచంలో జీవించాడు. కానీ అతడికి.. అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయిందని అతడి మరణాన్ని ఉద్దేశించి ఆయ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని పేర్కొంది. 
 
సుశాంత్ మృతి కేసు ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా చిత్రీకరించి, కట్టుకథలు అల్లారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ సందర్భంగా ఎవరి పేర్లనూ వారు ప్రస్తావించలేదు. సుశాంత్ తండ్రిపై శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే హీరో కుటుంబం ఇలా స్పందించడం గమనార్హం. పిల్లలకు మంచి జీవితం అందించడం కోసం స్వగ్రామాన్ని వదిలి నగరానికి మారే వరకు జరిగిన పరిణామాలను ఈ లేఖలో వివరంగా రాశారు. ఈ లేఖను హిందీలో రాశారు. తాము బెదిరింపులను ఎదుర్కొంటున్నామని ఆ లేఖలో చెప్పుకొచ్చారు.
 
కాగా.. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో మృతిచెంది కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తం కావడంతో ముంబై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ కుటుంబ సభ్యులు, పనివాళ్లు, బాలీవుడ్ ప్రముఖులు సహా ఇప్పటికే దాదాపు 56 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. మరోవైపు సుశాంత్ మృతిపై సీబీఐ, ఈడీ సంస్థలు సైతం కేసులు నమోదు చేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13న అతిలోక సుందరి జయంతి : నెట్టింట సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి వైరల్