Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలి దేశంలో సైనిక తిరుగుబాటు.. రక్తపాతం వద్దంటూ అధ్యక్షుడు రాజీనామా

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (08:51 IST)
అతి చిన్నదేశమైన మాలిలో సైనిక తిరుగుబాటు వచ్చింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సైనిక తిరుగుబాటుతో రక్తపాతం వద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ... ఆయన తన పదవి నుంచి స్వచ్చంధంగా తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తెల్లవారుజామున తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జాతీయ టీవీలో ప్రకటించారు. నిజానికి ఆయన పదవీకాలం మరో మూడోళ్ళపాటు ఉంది. 
 
కానీ, ఆ దేశ సైనికులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఫలితంగా బౌబాకర్ కీతా బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తిరుగుబాటు చేసిన సైనికులు అధ్యక్షుడు ఇబ్ర‌హీంను అదుపులోకి తీసుకున్నారు.
 
అంత‌కుముందు విజ‌య సూచ‌కంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. రాజ‌ధాని న‌గ‌రం బొమాకోను త‌మ ఆధీనంలోకి తీస‌కున్నారు. అధ్య‌క్షుడితోపాటు ప్ర‌ధాని బౌబౌ సిస్సేను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నిర్బంధించారు. తిరుగుబాటు సైనికుల‌తోపాటు, ప్ర‌జ‌లు కూడా భారీగా ‌రోడ్ల‌పైకి వ‌చ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments