Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు తీర్థంలా భావించి తాగిన బీజేపీ కార్యకర్త

అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగి

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:27 IST)
అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డా సెగ్మెంట్ ఎంపీ నిషికాంత్‌ ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా, కన్హావరా అనే గ్రామానికి వెళ్లారు. ఓ బ్రిడ్జిని నిర్మిస్తానని ప్రకటించిన దూబే ప్రసంగం పూర్తి కాగానే పళ్లెంతో వచ్చిన పవన్‌ అనే బీజేపీ కార్యకర్త ఎంపీ కాళ్లు కడిగాడు. 
 
అంతటితో ఆగక ఆ నీళ్లను తాగేశాడు. ఆ సమయంలో ఎంపీ అతణ్ని వారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ చర్యను ఆ కార్యకర్త సమర్థించుకున్నాడు. ఆయన తమకు అత్యంత ప్రియతమైన నేత అని, అందుకే అలా చేసినట్టు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments