Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చితికి నిప్పంటించగానే లేచి కూర్చొంది.. ఆస్పత్రికి వెళ్ళగానే చనిపోయింది...

పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా

Advertiesment
చితికి నిప్పంటించగానే లేచి కూర్చొంది.. ఆస్పత్రికి వెళ్ళగానే చనిపోయింది...
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:50 IST)
పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని చత్రాకు సమీపంలోని సోఖా ప్రాంతానికి చెందిన అమర్‌ చౌదరి కుమార్తె క్రాంతి కుమారి(16). ఈ యువతి ఆరుబయట నిద్రిస్తుండగా పాము కరిచింది. విష ప్రభావంతో స్పృహ కోల్పోయింది. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. అయితే క్రాంతి కుమారిలో ఎటువంటి చలనం లేకపోవడంతో మృతి చెందిందనే నిర్ధారణకు వచ్చారు. 
 
ఆ తర్వాత కుమారికి కర్మకాండలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసి మృతదేహాన్ని శ్మశానికి కూడా తీసుకెళ్లారు. భౌతికకాయాన్ని చితిపై పెట్టి... నిప్పు అంటించగానే ఆ యువతి చేతులు కదిలించింది. దీంతో ఆ యువతిని కిందికి దించి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు పెద్దాస్పత్రికి తరలిస్తుండగా యువతి కన్నుమూసింది. దీంతో తొలుత సిద్ధం చేసిన చితిపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైయ్యాక ఎందుకొచ్చావ్.. ముఖం చాటేసిన ప్రియుడు.. కారులో వెళ్తూ..?