Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థినిల లైఫ్ కోసమే వ్యభిచారం చేయమన్నా : ప్రొఫెసర్ నిర్మలాదేవి

విద్యార్థినిలు జీవితం బాగుకోసమే తాను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్టు ప్రొఫెసర్ నిర్మలాదేవి తమిళనాడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. పలువురు రాజకీయ నేతలు, బడా పారిశ్రామికవేత్తలు

Advertiesment
Madurai Kamaraj University sex scandal
, సోమవారం, 27 ఆగస్టు 2018 (08:50 IST)
విద్యార్థినిలు జీవితం బాగుకోసమే తాను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్టు ప్రొఫెసర్ నిర్మలాదేవి తమిళనాడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. పలువురు రాజకీయ నేతలు, బడా పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ పెద్దల లైంగిక అవసరాలు తీర్చాల్సిందిగా పలువురు విద్యార్థినిలను కోరినట్టు చెప్పింది. విద్యార్థినులను లైంగికంగా ప్రలోభాలకు గురిచేసిన మాట వాస్తవమేనని నిర్మలాదేవి సైతం అంగీకరించినట్లు సీబీసీఐడీ అధికారులు చెప్పారు.
 
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టైలోని ఒక ప్రైవేట్ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి తన కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులను పలురకాలుగా మభ్యపెట్టి ఉన్నతాధికారుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందిగా ఒత్తిడి చేశారు. ముఖ్యంగా తాతకు పడక సుఖం అందిస్తే మంచి మార్కులతో పాటు మంచి ఉద్యోగాలు దక్కించుకుని జీవితంలో స్థిరపడిపోవచ్చంటూ మభ్యపెట్టింది. 
 
సంబంధిత విద్యార్థినిలకు సెల్‌ఫోన్‌ ద్వారా పదేపదే వారిని సంప్రదిస్తూ ఒప్పించే ప్రయత్నం చేయడంతో ఈ విషయాన్ని సదరు విద్యార్థినులు తమ సెల్‌ఫోన్లలో రికార్డుచేశారు. నిర్మలాదేవి మాటల ఆధారంతో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. నిర్మలాదేవికి వ్యతిరేకంగా సీబీసీఐడీ కేసు నమోదుచేసి విచారిస్తోంది. ఇదిలావుండగా, నిర్మలాదేవిపై వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యూటీషియన్ పద్మను ఎలా చంపాడంటే... నిదింతుడూ సూసైడ్