అసిస్టెంట్ మహిళా ప్రొఫెసర్‌కు చుక్కలు చూపిన రాంగ్ కాల్...
అసిస్టెంట్ మహిళా ప్రొఫెసర్‌కు ఓ రాంగ్ కాల్ చుక్కలు చూపించింది. అదీ కూడా నెల రోజుల పాటు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
అసిస్టెంట్ మహిళా ప్రొఫెసర్‌కు ఓ రాంగ్ కాల్ చుక్కలు చూపించింది. అదీ కూడా నెల రోజుల పాటు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెల రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ రాంగ్ కాల్ వచ్చింది. దానికి జవాబు ఇచ్చిన మహిళ రాంగ్ నంబర్ అని చెప్పి కట్ చేసింది. ఇక మరుసటి రోజు నుంచే ఆమెకు సమస్య మొదలైంది.
అదే నంబరు నుంచి తరచుగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినప్పటికీ వాటికి స్పందించలేదు. దీంతో అజ్ఞాత వ్యక్తి మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. ఆ మెసేజ్‌లలో అంతా భూతులతో వర్ణిస్తుండడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఆగిపోతాయిలే అనుకున్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్ సమయాపాలన లేకుండా మోగుతుండటంతో చివరకు ఆ మహిళ ఈ నెల 19న పేట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వచ్చిన నంబరు ఆధారంగా పోలీసులు అజ్ఞాత వ్యక్తి జీడిమెట్లకు చెందిన ఓ ల్యాబ్ టెక్నీషియన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకుండా ఇంకా ఎంత మందిని ఈ విధంగా వేధించి ఉంటాడనే విషయంపై ఆరా తీస్తున్నారు.