Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగో పెళ్లికి సిద్ధమైన నిత్యపెళ్లికొడుకు.. సీన్లోకి వచ్చిన మూడో భార్య

నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ప్రబుద్ధుడు నాలుగో వివాహానికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అస

Advertiesment
నాలుగో పెళ్లికి సిద్ధమైన నిత్యపెళ్లికొడుకు.. సీన్లోకి వచ్చిన మూడో భార్య
, సోమవారం, 20 ఆగస్టు 2018 (11:23 IST)
నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ప్రబుద్ధుడు నాలుగో వివాహానికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే... సరూర్‌నగర్‌ భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉండే కృష్ణ, భారతి దంపతుల కుమారుడు శ్రీనివాస్‌కు మే 23, 2014న కామారెడ్డి శ్రీరమణారెడ్డి కాలనీకి చెందిన నారాయణ, నాగరాణి దంపతుల కుమార్తె అనూషతో వివాహం జరిగింది.
 
శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వివాహ సమయంలో రూ.5లక్షల నగదు, 15తులాల బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఘనంగా వీరి వివాహం జరిపించారు పెద్దలు. రెండు సంవత్సరాల పాటు వీరం సంసారం సాఫీగా జరిగింది. కానీ ఆపైనే అనూషకు అసలు వేధింపులు మొదలయ్యాయి. అత్తగారింటి వేధింపులకు తట్టుకోలేక కొంతకాలం నుంచి అనూష పుట్టింటి వద్దే ఉంటోంది. గతంలో జరిగిన పెళ్లిళ్లను దాచి అనూషను పెళ్లి చేసుకుని ఈమెను కూడా వదిలించుకోవడానికి విడాకుల నోటీసులు పంపించాడు. 
 
అంతేగాకుండా ఈ నెల 25న మరో మహిళతో నాలుగో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుసుకున్న అనూష.. ఆదివారం అత్తగారింటికి వచ్చింది. ఇంకా సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం భాగ్యనగర్‌ కాలనీలో అత్తగారింటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆందోళనకు గురైన అనూష అక్కడే నిరసన దీక్ష చేపట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిహద్దుల్లో జవాన్లను చంపేస్తుంటే.. నవజ్యోత్ వెళ్లి హత్తుకుంటారా?