Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు పుట్టబోయే బిడ్డ.. డాక్టర్ కావాలన్నదే నా కోరిక: సానియా మీర్జా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గర్భంతో వున్న సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డను స్పోర్ట్స్‌ స్టార్‌గా చూడాలనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది. భవిష్యత్తులో మీ బిడ్డను భారత్ లే

Advertiesment
నాకు పుట్టబోయే బిడ్డ.. డాక్టర్ కావాలన్నదే నా కోరిక: సానియా మీర్జా
, సోమవారం, 13 ఆగస్టు 2018 (09:51 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గర్భంతో వున్న సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డను స్పోర్ట్స్‌ స్టార్‌గా చూడాలనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది. భవిష్యత్తులో మీ బిడ్డను భారత్ లేదా పాకిస్థాన్ ఏ దేశం తరపున ఆడిస్తారు? అంటూ ఇంటర్వ్యూలోలో అడిగిన ప్రశ్నకు సానియా ఇలా సమాధానం ఇచ్చింది.
 
భవిష్యత్తులో తన బిడ్డను ఏ క్రీడలోనూ చూడాలనుకోవట్లేదని.. తన బిడ్డను గొప్ప డాక్టర్‌గా చూడాలనుకుంటున్నట్లు తెలిపింది. తన బిడ్డ జాతీయత గురించి ఆలోచించడం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అదే సమస్య తలెత్తితే భారత్, పాక్ కాకుండా మూడో దేశాన్ని ఎంచుకుంటానని పేర్కొంది. తమకు ఎవరు పుట్టినా ఓకే అని, అయితే షోయబ్ మాత్రం అమ్మాయినే కోరుకుంటున్నాడని సానియా మీర్జా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సానియాకు ఏడో నెల కొనసాగుతోంది. 
 
కాగా భారత్-పాకిస్థాన్ అంటేనే చాలామంది వైరం అనుకుంటున్నారని...కానీ ఆ భావన సరికాదని సానియా మీర్జా తెలిపింది. చాలా మంది ప్రజలు ఈ భావనను కలిగి ఉన్నారని, తాను రెండు దేశాలని ఐక్యపరచడానికి వివాహం చేసుకున్నాను. తాను పాకిస్థాన్‌కు వెళ్తే.. ఆ దేశ చట్టాల ప్రకారం నడుచుకుంటా. ప్రతీ ఏడాది అక్కడి వెళ్తా. ఆ దేశ ప్రజల ప్రేమ అపారమైనది.
 
మొత్తం దేశం తనను బాబీ అని పిలుస్తుంది. పాకిస్థానీయులు తనకు ఎంతో గౌరవం ఇచ్చారు. పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్‌ పట్ల గల గౌరవాన్ని.. ఆ దేశ ప్రజలు తనపై చూపుతున్నారని, అదే తరహాలో షోయబ్ ఇక్కడకు వచ్చినప్పుడు తన దేశ ప్రజలు కూడా ప్రేమ, గౌరవాన్ని పొందుతాడని సానియా క్లారిటీ ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లాండ్ సూపర్ ఇన్నింగ్స్.. 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌