పుదీనా టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో...
పుదీనా ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటాం. దీని వలన వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. పుదీనా ఆహార పదార్థంగానే కాకుండా పలు అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పుదీనా ఆకు
పుదీనా ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటాం. దీని వలన వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. పుదీనా ఆహార పదార్థంగానే కాకుండా పలు అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పుదీనా ఆకులతో తయారు చేసే టీని ప్రతిరోజూ తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఈ పుదీనా టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 కప్పుల నీటిలో ఒక బౌల్‌లో తీసుకుని ఆ తర్వాత అరకప్పు పుదీనా ఆకులను వేసుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత ఈ మిశ్రమంలో తగినన్ని పాలు, ఒక యాలక్కాయ వేసుకుని మరికాసేపు మరిగించుకోవాలి. టీ చల్లారిన తరువాత వడకట్టుకోవాలి. మరి ఈ టీలో గల లాభాలు తెలుసుకుందాం.
పుదీనాలో ఉండే విటమిన్ ఎ, సిలు శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. ఈ పుదీనా టీని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీర పనితీరు పెరుగుపడుతుంది. తద్వారా శరీరానికి కావలసిన రాగి, పీచు, క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు కూడా అందుతాయి.
గర్భిణీలకు అవసమయ్యే ఫోలిక్ యాసిడ్, ఒమెగా-3, ఫ్యాటీ యాసిడ్స్ పుదీనా టీలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకే కాకుండా శిశువు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో కణతులు పెరగకుంటా ఉంటాయి. పలు రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.