చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే?
తేనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తేనె దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. తేనెను వాడటం వలన చిన్న పిల్లలలో రాత్రి సమయంలో వచ్చే దగ్గును తగ్గించవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు కలిపిన తేనె మిశ్రమం తాగటం వలన నిద్రల
తేనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తేనె దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. తేనెను వాడటం వలన చిన్న పిల్లలలో రాత్రి సమయంలో వచ్చే దగ్గును తగ్గించవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు కలిపిన తేనె మిశ్రమం తాగటం వలన నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఆహారం తీసుకునే ముందు రెండు స్పూన్లు తేనె తీసుకుంటూ వస్తే.. అసిడిటీకి చెక్ పెట్టవచ్చు.
రోజూ ఆహారానికి ముందు రెండు స్పూన్ల తేనె తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. బొజ్జనొప్పికి బొడ్డుచుట్టూ తేనెతో మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే.. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను దానిమ్మ రసంతో కలుపుకుని రోజూ తీసుకుంటే.. గుండెపోటు సమస్యలు దరిచేరవు.
తేనెను పరగడుపున వేడి నీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. శరీరం దృఢంగా తయారవుతుంది. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వేవిళ్లు, జలుబు తగ్గుతుంది. తేనెతో ఉల్లిపాయల రసాన్ని కలిపి తీసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే, శ్వాసకోశ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. బార్లీ గంజిని తయారు చేసుకుని దానిని వడగట్టి.. అందులో తేనె కలిపి తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.