Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగులో గుడ్డు తెల్లసొనను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాల

Advertiesment
పెరుగులో గుడ్డు తెల్లసొనను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?
, శనివారం, 4 ఆగస్టు 2018 (15:05 IST)
కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాలతో మెుటిమలను తొలగించుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
పెరుగులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమల తాలూకు మచ్చలు తొలిగిపోతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనని వేరుచేసుకుని గిలక్కొట్టి మృదువుగా చేసుకోవాలి. ఆ తెల్లసొనలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.  
 
తద్వారా మెుటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఓట్‌మీల్‌ను పొడి చేసుకుని ఆ పొడిలో పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ చీజ్ శాండివిజ్ ఎలా చేయాలో చూద్దాం..