Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొబ్బరినీళ్లను జుట్టు రాసుకుంటే?

ఈ కాలంలో ఉన్న కాలుష్యం ఇతర కారణాల వలన మహిళలకు, పురుషులకు జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. కొబ్బరి నీళ్ళను జుట్టుకు రాసుకుని మ

కొబ్బరినీళ్లను జుట్టు రాసుకుంటే?
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (12:56 IST)
ఈ కాలంలో ఉన్న కాలుష్యం ఇతర కారణాల వలన మహిళలకు, పురుషులకు జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. కొబ్బరి నీళ్ళను జుట్టుకు రాసుకుని మర్దనా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తొలగిపోతాయి.
 
ఆపిల్ సిడర్ వెనిగర్‌ను కొబ్బరినీళ్లలో కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. నిమ్మరసంలో కొబ్బరి నీళ్లను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు రాసుకుని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆపై 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. 
 
కొబ్బరినీళ్లలో తేనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థైరాయిడ్‌ను దూరం చేసుకోవాలంటే.. జామకాయను?