Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఈ పని చేయండి..

చాలా మంది వయసు మీదపడుతున్నా నిత్య యవ్వనంగా ఉండాలని పరితపిస్తుంటారు. ముఖ్యంగా, మోడలింగ్ చేసేవారు, సినీ సెలెబ్రిటీలు, కొందరు రాజకీయ నేతలు మాత్రం ఎపుడు చూసినా చాలా చలాకీగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనిక

Advertiesment
Water
, శనివారం, 4 ఆగస్టు 2018 (15:46 IST)
చాలా మంది వయసు మీదపడుతున్నా నిత్య యవ్వనంగా ఉండాలని పరితపిస్తుంటారు. ముఖ్యంగా, మోడలింగ్ చేసేవారు, సినీ సెలెబ్రిటీలు, కొందరు రాజకీయ నేతలు మాత్రం ఎపుడు చూసినా చాలా చలాకీగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనికి కారణం వారు తీసుకునే ఆహారంతో పాటు.. నీరు.
 
నీరు ఒక మనిషికే కాదు, సమస్త ప్రాణికోటికి కూడా ఒక అద్భుతపానీయంగా చెబుతుంటారు. భూగోళం 70 శాతం వరకు నీటితోనే నిండి ఉంటుంది. ఆ నీటిలో సైతం ఎక్కువ శాతం ఉప్పునీరే. మిగిలిన కొద్దిశాతం మాత్రమే తాగునీరుగా ఉంది. అలాంటి అద్భుతమైన పానీయమైన నీరును రోజు ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. 
 
ప్రతి రోజూ క్రమం తప్పకుండా రోజుకు 7 లేదా 8 గ్లాసుల నీరు తాగినట్టయితే యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు. అలాంటి నీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. 
 
* నీరు శక్తిని పెంచుతుంది. అలసటను దూరం చేస్తుంది. 
* మెదడులో ఎక్కువశాతం నీరే ఉండడంతో నీటిని తాగడం వల్ల ఆలోచన పెరుగుతుంది. 
* ఏకాగ్రత్త పెరగడంతో పాటు చురుకుగా, చలాకీకా ఉండొచ్చు. 
* భోజనం ముందు నీటిని తాగితే తినే ఆహారాన్ని తక్కువగా తీసుకోవచ్చు. 
* తద్వారా కొవ్వును కరిగించడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. 
* నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి. 
* తద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంచుతుంది.
* చర్మం పొడిబారకుండా ఉండి, తాజాగా ఉంటాం. 
* నీరు ఎక్కువగా తాగే వారికి రోగాలు వచ్చే శాతం తక్కువ. 
* మలబద్దకాన్ని దూరం చేస్తుంది. 
* శరీరానికి సరైన క్రమంలో నీరు అందడం వల్ల కీళ్ల కదలికకు అవసరమైన ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. 
* నీటిని కావాల్సినంతగా తీసుకోవడం వల్ల శరీరం చక్కగా పనిచేస్తుంది. 
* శరీరం నుంచి మూత్రం, చెమట రూపంలో రోజుకు మూడు లీటర్ల నీరు బయటకు పోతుంది.
* ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు తాగడం మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండ్ల రసంలో అవిసె గింజల పొడిని కలుపుకుని తాగితే...