Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూగజీవిని వదిలిపెట్టని కామాంధులు... గర్భంతో వున్న ఏడేళ్ల మేకపై గ్యాంగ్ రేప్

కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు, బాలికలపై వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్న కామాంధులు, మూగజీవులను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా మేకను కూడా వదిలిపెట్టలేదు. గర్భంతో ఉన్న ఏడేళ్ళ మేకపై ఎనిమిది మంది రేప్

Advertiesment
Pregnant
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (11:44 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు, బాలికలపై వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్న కామాంధులు, మూగజీవులను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా మేకను కూడా వదిలిపెట్టలేదు. గర్భంతో ఉన్న ఏడేళ్ళ మేకపై ఎనిమిది మంది రేప్‌ చేసిన ఘటన హర్యానాలోని మేవత్‌ జిల్లాలో జరిగింది. ఈ మేరకు మేక యజమాని అస్లుప్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. మేవత్ జిల్లా, మరోడా గ్రామానికి చెందిన ఎనిమిది రౌడీ షటర్లు గర్భంతో వున్న మేకపై అత్యాచారానికి పాల్పడ్డారని ఖాన్ ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం ఓ రౌడీమూక మేకను తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా, తాను అడ్డుకున్నానని.. రాత్రి మేకపై అత్యాచారం చేశాడని, క అరుపులకు నిద్రలేచి చూసి సరికి నిందితులు పారిపోయారన్నాడు.
 
కానీ వారిలో ముగ్గురిని గ్రామస్థులు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై సెక్షన్‌ 377 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మేక మృతి చెందింది. బుధవారం రాత్రి ఇంటి వద్ద మేక కన్పించకపోతే... గ్రామంలో వెతికానని, ఓ షెడ్‌లో అరుపులో వినిపించగా.. అక్కడికెళ్ళి చూడగా.. ముగ్గురు మేకను లైంగికంగా వేధించడం తాను చూశానని అస్లుప్‌ చెప్పాడు. 
 
మిగిలినవారు కూడా మేకపై లైంగిక చర్యకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో ఆ ముగ్గురిని గ్రామస్థుల సాయంతో చితకబాదినట్లు అస్లుప్ అనే వ్యక్తి వెల్లడించాడు. నిందితులు తాగిన మైకంలో ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఇకపోతే.. ఈ ఘటనపై పెటా మండిపడింది. ఇంకా జస్టిస్ ఫర్ గోట్ అనే హ్యాష్‌ట్యాగ్ పేరిట సెలెబ్రెటీలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకా మేకకు న్యాయం జరగాలని మద్దతు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంటింట్లోకి ఎంట్రీ ఇచ్చిన కొండచిలువ.. టీ కాచుకుందామని కిచెన్‌లోకి వస్తే?